telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

ఎన్నికల పబ్బం

election notifivation by 12th said ec

తూరుపు తెల్లారుతోంది
పడమటి చుక్క మునుగుతోంది
పక్షుల కీచులాటలు రాసుకుంటున్నాయి
భానుడు పగతో ఎగబాకుతున్నాడు
నామదిలో అలజడి మొదలయ్యింది
పొద్దెక్కేకొద్దీ నాగొంతుతడి ఆరిపోతోంది
చుక్క నీటి కోసం వెతుకులాట
పంటచేలు తడికోసం
కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాయి
పశువులను బాదుతున్నా
బయటకు వెళ్ళేటట్టులేవు
కొండ అంచులలో
అగ్ని దేవుడు భగభగమంటున్నాడు
గ్రామ పరిసరాలో
ఎండమావులు ఎగిసిపడుతున్నాయి
మొరపెట్టుకుందామంటే
హడావిడిలో అధికారులు
అజ్ఞాతంలో ప్రజాప్రతినిధులు
ఓట్ల వేటలో నాయకులు
విచిత్రమో వైపరీత్యమో
ఆ భగవంతుడికే తెలియాలి
నీటికోసం అలమటిస్తావుంటే
సీసాలలోని మద్యం
ఏరులై పారుతోంది
కారణమేమని చింతిస్తావుంటే
ఎన్నికల పండుగొచ్చిందట
అందుకేనేమో ఎన్నికలంటే
నాయకులకంటే మందుబాబులకే
ఊపెక్కువ.

*ముంటిమడుగు బాబ్జాన్*
9618397271
పుట్టపర్తి

Related posts