Trending Today రాజకీయ వార్తలు వార్తలు

ఎన్నికల తేదీ ఖరారు…నవంబర్ 24.. కేసీఆర్ జాతకరీత్యా…!

Seven Candidates Not Eligible in Elections

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు ఈసీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు కావలసిన సరంజామా అంతా కూడా ఆయా జిల్లాకు చేరింది. ఓటర్ నమోదు ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. నకిలీ ఓటర్ లను తొలగిస్తూ, కొత్తవారికి గుర్తింపు కార్డులు ఇచ్చే పనిలో యంత్రంగం బిజీబిజీ గా ఉంది. ఎన్నికలను కూడా ఆరు నెలలలో నిర్వహిస్తామని ముందుగానే రాష్ట్ర ఈసీ స్పష్టం చేసింది.

అనుకున్నట్టుగానే ఎన్నికల సంఘం తెలంగాణాలో నవంబర్ 21-26మధ్య ఎన్నికల తేదీని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ జాతకం ప్రకారం 24 అయితే బాగుంటుంది అనేది స్పష్టం అవటంతో నవంబర్ 24న ఎన్నిక జరిగేలా ఈసీ కూడా తమ కార్యాచరణను రూపొందిస్తున్నారు. 6 అనే సంఖ్య కేసీఆర్ కు లక్కీ నంబర్ కావటంతో ఆ రోజే ఎన్నిక నిర్వహించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నమ్మకాలతోనే కేసీఆర్ సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీ ని రద్దు చేశారు. అలాగే తనకు ఎప్పటి నుండో కలిసివస్తుంది అనుకుంటున్న హుజురాబాద్ నుండే ప్రచారం ప్రారంభించారు కేసీఆర్.

మరో పక్క ఎన్నికల సంఘం కూడా అక్టోబర్ 8 నాటికి ఓటర్ల జాబితాను సిద్ధం చేయనుంది. ఈ తుది జాబితాని కూడా సరిచూడటానికి ఈసీ ఆడిట్ టీం ద్వారా పర్యవేక్షిస్తుంది. ఇక నవంబర్ లో ఎన్నికలు జరగాల్సిన ఇతర రాష్ట్రాల(రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం)లో కూడా ఈ తరహా ఆడిట్ ఈసీ నిర్వహిస్తుంది. అలాగే ఈ రాష్ట్రాలలో ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న తర్ఫీదు లను కూడా ఈసీ ఆడిట్ ద్వారా సమీక్షించనుంది.

Related posts

లీకైన సైఫ్ కొత్త మూవీ లుక్… ఇంతవరకెప్పుడూ సైఫ్ ను ఇలా చూసి ఉండరు…!!

vimala t

అమెరికాలో మరోసారి కాల్పులు…ఇది ఉగ్రవాద చర్యేనా…

chandra sekkhar

ఇంటి వెలుగు…

chandra sekkhar

Leave a Comment