telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ముసలోడేమ్ చేస్తాడు అనుకున్నారు… కానీ…

Elderly Man Released From Prison Deemed Too Old To Be Dangerous Kills Again

అతని పేరు ఆల్బర్ట్ ఫ్లిక్. 1979లో కన్న కూతురి కళ్లముందే కట్టుకున్న భార్యను 14 సార్లు కసితీరా పొడిచేసి జైలుకెళ్లాడా నిందితుడు. ఈ ఘోరమైన కేసులో నిందితుడిగా తేలడంతో అతనికి 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. ఆ శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత అతనిలో మార్పు వచ్చిందని భావించింది. అదీగాక అప్పటికే అతని వయసైపోయిందని, కాబట్టి అతనంటే భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఆ అభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి అభిప్రాయాన్ని ఆల్బర్ట్ తలకిందులు చేశాడు. విడుదలైన ఆరేళ్లకు ఇంటికి దగ్గరలో అద్దెకు వచ్చిన మరో మహిళపై దాడికి దిగాడు. అమెరికాలోని మైన్‌కు కొత్తగా వచ్చిన డొబ్బీ అనే 48 ఏళ్ల మహిళను ఆమె ఇద్దరు పిల్లల కళ్లముందే దారుణంగా పొడిచి చంపేశాడు. అప్పటికి 68 ఏళ్ల వయసున్న ఆల్బర్టే హంతకుడని పోలీసులు తేలిగ్గానే గుర్తించగలిగారు. 2010లో జరిగిన ఈ ఘటనలో ఆల్బర్ట్‌ను మళ్లీ జైలుకు పంపారు. డొబ్బీని ఆల్బర్ట్ ప్రేమించాడని చెప్పిన అధికారులు.. ఆమె మరో ఊరు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసి షాకయ్యాడని చెప్పారు. తాను అంతలా ప్రేమిస్తే.. ఆమె తనను వదిలేయడం ఏంటని ఆల్బర్ట్‌కు కోపం వచ్చిందన్నారు. దాంతో ఆమెను హత్య చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు 77 ఏళ్ల ఆల్బర్ట్‌కు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Related posts