telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ దేశంలో అత్యాచారంతో గర్భం దాల్చినా బిడ్డను కనాల్సిందే…!

EL

సెంట్రల్ అమెరికాలోని ఎల్ సల్వడార్ దేశంలో చట్టాలు ఎలా ఉంటాయంటే… ఓ యువతి అత్యాచారానికి గురై గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోకూడదు… పుట్టిన బిడ్డను చంపకూడదు. రెండింటిలో ఏది చేసినా ఆ యువతికి జైలుశిక్షను విధిస్తారు. ఎవెలిన్ హెర్నాండెజ్ (21) అనే యువతికి బిడ్డను చంపిన నేరానికి 2017లో ఎల్ సల్వడార్ కోర్టు 30 ఏళ్ల శిక్షను విధించింది. అయితే 33 నెలలు జైలుశిక్షను అనుభవించిన తరువాత కోర్టులో రీట్రైల్ వేయగా.. ఆమె నిర్దోషి అని కోర్టు తేల్చి విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే… 2017లో ఎవెలిన్ తన ఇంట్లోని బాత్రూంలో రక్తపు మడుగుల్లో పడి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భం దాల్చిందని.. డెలివరీ కూడా అయిపోయిందని తెలిసింది. అయితే ఆమె కడుపులో బిడ్డ లేకపోవడంతో డాక్టర్లు అధికారులకు సమాచారమిచ్చారు. ఎవెలిన్ ఇంటికి వెళ్లి పరిశీలించగా.. బాత్రూంలోని సెప్టిక్ ట్యాంక్‌లో బిడ్డ కనిపించింది. దీంతో ఎవెలిన్ బిడ్డను చంపేసిందంటూ లాయర్లు కోర్టులో వాదించగా.. జడ్జి ఆమెకు శిక్షను విధించారు. తాను ఏ తప్పు చేయలేదని ఎవెలిన్ వాదించినప్పటికీ.. ఏం లాభం లేకపోయింది. అలా ఆమె జైలు శిక్షను అనుభవిస్తూ వస్తుండగా.. ఆమె స్నేహితురాళ్లు, మహిళా సంఘాలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎవెలిన్ తీర్పుకు సంబంధించి రీట్రైల్ జరగాలని కేసు వేశారు. కోర్టు దీనికి అంగీకరించి మరోసారి విచారణకు ఆదేశాలిచ్చింది. ఎవెలిన్‌కు కనీసం గర్భం దాల్చిన సంగతి కూడా తెలియదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆమె అత్యాచారానికి గురైందని.. తద్వారా గర్భం దాల్చి ఉంటుందని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డను ఎవెలిన్ చంపలేదని.. యాస్పిరేషన్ న్యూమోనియాతో బిడ్డ చనిపోయినట్టు డాక్టర్ సాక్ష్యాలు చూపించారు. ఎవెలిన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి ఎవెలిన్ ఎటువంటి తప్పు చేయలేదంటూ తీర్పునిచ్చి ఆమెను విడుదల చేసింది.

Related posts