telugu navyamedia
telugu cinema news trending

సుశాంత్ ను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిందే నేను : ఏక్తాక‌పూర్‌

Ekta-Kapoor

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌కు బాలీవుడ్‌లోకి కొంద‌రు ప్ర‌ముఖులే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ స‌ల్మాన్‌ఖాన్‌, క‌ర‌ణ్‌జోహార్, సంజ‌య్‌లీలా భ‌న్సాలీ, ఏక్తాక‌పూర్‌, దినేష్‌, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, భూష‌ణ్‌కుమార్‌, ఆదిత్య చోప్రాల‌పై సుశాంత్ సొంత రాష్ట్ర‌మైన బీహ‌ర్‌లోని ముజుఫ‌ర్ న‌గ‌ర్‌లోని కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. బాలీవుడ్ మాఫియా కార‌ణంగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ సుధీర్‌కుమార్ అనే న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నిర్మాత ఏక్తా క‌పూర్ స్పందించారు. బాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై కేసుకు సంబంధించిన ఆర్టిక‌ల్‌ను స్క్రీన్ షాట్ తీసిన ఏక్తాక‌పూర్ దాన్ని షేర్ చేస్తూ “సుశాంత్‌ను నా బ్యాన‌ర్‌లో న‌టింప చేయ‌లేద‌ని కేసు పెట్టినందుకు ధ‌న్య‌వాదాలు. నిజానికి అత‌న్ని సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిందే నేను. ఈ అర్థం ప‌ర్థం లేని మెళిక‌ల‌తో అప్ సెట్ అయ్యాను” అని తెలిపారు ఏక్తాకపూర్.

Related posts

ఉప్పెన గురించి పవన్ ఎమ్మనడంటే…?

Vasishta Reddy

మూడు పార్టీలతో హీరో నిఖిల్ రాజకీయం

vimala p

“గాడ్సే” గా అవతారంలో సత్యదేవ్‌…

Vasishta Reddy