telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు

EGGS

చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే వదంతుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో చికెన్, ఎగ్స్ తినే వారి సంఖ్య బాగా తగ్గింది. ఆ సమయంలో కోళ్లను ఉచితంగా పంచారు కూడా. కానీ అవ్వన్నీ కేవలం కల్పితాలేనని అని తేలడంతో మళ్లీ చికెన్, ఎగ్స్‌ను వినియోగం బాగా పెరిగింది. అయితే లాక్ డౌన్ కారణంగా కోళ్లకు దాన లేకపోవడంతో చాలా వరకు చనిపోయాయి. దీంతో ఇప్పుడు చాలా ఫామ్స్‌లో సగం వరకే కోళ్లు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఎగ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అయితే పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సప్లై లేదు. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ నెలలో కోడి గుడ్ల ధర రిటైల్ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు (ఒక్కో గుడ్డుకు) చేరింది. గత వారంలో డజను గుడ్ల ధర రూ.60-65 వరకు ఉండేది. కానీ ఇప్పుడు డజను గుడ్ల ధర రూ.80కు చేరింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా గుడ్ల ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని గుడ్ల వ్యాపారులు పేర్కొంటున్నారు. 2021 ఫిబ్రవరి వరకు కోడి గుడ్ల ధర పెరుగుతూనే ఉండొచ్చని తెలిపారు. తగ్గే ఛాన్స్ లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికే చికెన్ ధర కూడా కొండెక్కి కూర్చుంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి.

Related posts