telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా సెకండ్‌ వేవ్‌ లేదు…

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని…సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీమెంట్ 2020-2021ను ప్రారంభించారు మంత్రి ఈటెల రాజేందర్. ఈ కార్యక్తమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలంపియన్ జేజే శోభా, బాక్సర్ నికత్ జరీన్, ఇంటర్ నేషనల్ షూటర్ ఈషా సింగ్ కూడా పాల్గొన్నారు. అయితే మూడు రోజల పాటు జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనన్న 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీల జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ… కరోనా వారియర్స్ కు క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఆనందదాయకం. ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి సంపిల్స్ సీసీఎంబి కి పంపించాము. అందులో ఒక్కరికి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. టెంపరేచర్ పెరిగితే కరోనా ఫస్ట్ ఫేస్ అంతం అవుతుందని యోచిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్న అన్నారు. అలాగే వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10 వేల మంది సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తాం. రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ వేసేవిధంగా సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు మంత్రి ఈటల.

Related posts