telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అగ్ర నటులతో .. చేయాలనుంది .. : ఈషారెబ్బా

తెలుగు నటులలో ఈషారెబ్బా ఒకటి. ఇటు గ్లామర్ పాత్రలకైనా, ఫ్యామిలీపాత్రలకైనా పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. నటనతోపాటు తనదైన శైలిలో నటనను ప్రదర్శిస్తూ అందాల ఆరబోతలోనూ ఏమాత్రం వెనుకంజ వేయదు. కానీ, టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఆమెవైపు కన్నెత్తిచూడటం లేదట. దీంతో ఈ బ్యూటీ తెగబెంగపెట్టుకుందట. ఇటీవల త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం “అరవింద సమేత”. ఇందులో రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశం కొట్టేసింది.

అదే సమయంలో ఈ అమ్మడుకు స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నప్పటికీ.. అగ్ర హీరోలతో నటించే అవకాశమే రావడంలేదని వాపోతోంది. దీని తో పెద్ద హీరోలతో ఛాన్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అదేసమయంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్‌లు చేస్తూ… సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. మరి ఈషారెబ్బా జాతకం ఎప్పుడు మారుతుందో ఏమో పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో…పాపం… ఇకముందు అయినా తనకు మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం!

Related posts