• Home
  • Trending Today
  • ఇకనుంచి ఇండిగో ఫ్లైట్ లో ఎవరూ ప్రయాణించొద్దు : ఈషా రెబ్బ
Trending Today సినిమా వార్తలు

ఇకనుంచి ఇండిగో ఫ్లైట్ లో ఎవరూ ప్రయాణించొద్దు : ఈషా రెబ్బ

eesharebba

ఇకనుంచి ఎవరూ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించొద్దని సలహా ఇస్తోంది నటి ఈషా రెబ్బ. ఇండోగో ఫ్లైట్ సిబ్బంది వల్ల ఈ భామ చాలాసార్లు ఇబ్బంది పడిందట. దీంతో విసుగు చెందిన ఈషా సోషల్ మీడియాలో నెటిజన్లకు ఈ సలహా ఇస్తోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ ఇండిగో ఫ్లైట్ సిబ్బంది నిర్వాకం కారణంగా తాను ఎలా ఇబ్బంది పడ్డాడో తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఈషా రెబ్బ స్పందిస్తూ ఇలా సలహా ఇచ్చింది.

“ఇండిగో కారణంగా నేను ఫ్లైట్ మిస్ కావడం ఇది వారంలో రెండవసారి. ఇది రూల్స్ వల్ల జరిగింది కాదు… ఇండిగో ఉద్యోగుల ఈగో కారణంగా జరిగింది… వాళ్ళు నన్ను ఒక్క నిమిషం ఆగమని చెప్పి 10 నిమిషాలు వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిందే కాకుండా నువ్వు 5 నిమిషాలు లేట్ అంటూ ఆరోపించారు. నేను వాళ్ళను ప్రశ్నించగా అది మా రూల్ అంటూ సమాధానమిచ్చారు” అంటూ తన ఆవేదనను ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు ఆ నెటిజన్.

ఈ ట్వీట్ ను చూసి స్పందించిన ఈషా రెబ్బ “మీరు చెప్పింది నిజమే… నేను కూడా ఇండిగో కారణంగా ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నాను. అందుకే ఇండిగో ఫ్లైట్ లో ఎప్పుడూ ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాను. వారి రూల్స్ ని సెట్ చేసుకునే వరకూ ఎవరూ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ కు “నెవర్ ఫ్లై ఆన్ ఇండిగో, అవాయిడ్ ఇండిగో” అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా జత చేశారు ఈషా రెబ్బ.

Related posts

బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్… గోవాలో లాంచ్

jithu j

భర్తతో కలిసి రీఎంట్రీ ఇవ్వబోతున్న బిపాసా

jithu j

ఈ కంప్యూటర్ ధర అప్పట్లో 48 వేలు.. ఇప్పుడు సుమారు 2.72కోట్లు

nagaraj chanti

Leave a Comment