telugu navyamedia
సినిమా వార్తలు

“ఏదైనా జరగొచ్చు” టీజర్… ఈ తింగరి బిడ్డలను నువ్వే కాపాడాలి ప్రభువా

Edaina-Jaragocchu

వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ మరియు సుదర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఏదైనా జరగొచ్చు”. రమాకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విలక్షణ నటుడు తమిళ స్టార్ బాబిసింహా విలన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు చాలామంది ప్రముఖ నటులకు శిక్షణ అందించిన వైజాగ్ సత్యానంద్ కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారు అల్లుడు రవిశివతేజ లు హీరో స్నేహితులు గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో టీజర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న నాగబాబు టీజర్ లో “ఈ తింగరి బిడ్డలను నువ్వే కాపాడాలి ప్రభువా…” అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Related posts