telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ను ప్రశ్నించిన .. ఈడీ ..

ED questioned naresh goyal on

నరేశ్‌ గోయల్‌ను ఈడీ విదేశీ మారక చట్టం ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రశ్నించింది. విచారణలో భాగంగా ఆయన చెప్పిన సమాధానాలను విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం రికార్డు చేశామని ముంబయిలోని జోనల్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. గతనెల ఆగస్టులో ముంబయి, దిల్లీలోని గోయల్‌ కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ మొదటి సారిగా గోయల్‌ను విచారించింది. అధికారులు తెలిపిన సమాచారం మేరకు గోయల్‌కు చెందిన 19 కంపెనీల్లో ఐదు కంపెనీలు విదేశాల్లో ఉన్నాయి.

ఆయా సంస్థలకు చెందిన క్రయ విక్రయాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో ఎక్కువ మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిపారు. దీని ద్వారా జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థకు భారీ నష్టాలను చూపించారని అధికారులు ఆరోపిస్తున్నారు. జెట్‌ఎయిర్‌వేస్‌ నష్టాల ఊబిలో కూరుకుపోవడంలో ఏప్రిల్‌ 17న సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత మార్చిలో ఛైర్మన్‌ పదవికి నరేశ్‌ గోయల్‌ రాజీనామా చేశారు. నిధులు లేమి కారణంగా సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో జెట్ఎయిర్‌వేస్‌ నుంచి భారీగా నిధుల మళ్లింపు జరిగిందని కార్పోరేట్‌ వ్యవహారాల శాఖ నివేదికలో తేలడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

Related posts