telugu navyamedia
రాజకీయ

రాబర్ట్ వాద్రా కు.. 4.6 కోట్ల ఆస్తుల అటాచ్.. ఈడీ

OU students wrote letter to EC
పార్టీలు అధికారం కోసం ఒకరి గోతులు ఒకరు తొవ్వుకుంటున్నారు. ఒకరి స్కాం లు ఒకరు తోడుకుంటున్నారు. దీనితో అధికారుల హడావుడి చేస్తున్నారు. బీజేపీపై రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందం అస్త్రాన్ని ఉపయోగిస్తే; అదే బీజేపీ వాద్రాపై ఈడీని వదిలింది. తాజాగా, ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. బికనేర్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా కంపెనీకి చెందిన రూ.4.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో వాద్రా కంపెనీకి చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. 
బికనేర్ భూ కంభకోణం కేసులో ఈడీ 2015లో క్రిమినల్ కేసు నమోదు చేసింది. భూకేటాయింపుల్లో ఫోర్జరీ జరిగిందని ఆరోపిస్తూ బికనేర్ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో మంగళవారం రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌లను జైపూర్‌లో ఈడీ విచారించింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వాద్రా భార్య ప్రియాంక కూడా ఉన్నారు. గతవారం రాబర్ట్ వాద్రాను ఈడీ ఢిల్లీలో మూడు రోజులపాటు విచారించింది. తాజాగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటించింది.

Related posts