telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎంపీలకు .. పర్యావరణ హిత వాహనాల పంపిణీ..

eco friendly vehicles to mp's

పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటి రోజునే పలువురు ఎంపీలకు పర్యావరణహితమైన సైకిళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలలు అందటంతో, ఆ వాహనాలలోనే సమావేశాలకు హాజరయ్యారు. ముఖానికి మాస్క్‌లు ధరించారు. బీజేపీ ఎంపీలు మన్‌సుఖ్‌ మాండవీయ, మనోజ్‌ తివారీ సైకిల్‌పై రాగా, పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ఎలక్ట్రిక్‌ కారులో వచ్చారు. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాజధానిలో కాలుష్యం కొంత మేర తగ్గినప్పటికీ నాణ్యత మాత్రం దారుణంగానే ఉంది.

ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణాన్ని క్రమంగా ప్రోత్సహిస్తోందని మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ప్రజలు కూడా కాలుష్య నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటం పట్ల నాయకులతో పాటు సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts