telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”కు ఈసీ ట్విస్ట్… ప్రివ్యూ వేయాల్సిందే…?

rgv lakshmis ntr movie trailer on 14 feb

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చిత్రానికి ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికల సంఘం ముందు రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు. ఒకవైపు తెలుగుదేశం నేతలు ఈ చిత్రం విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు అడ్డుపోవాలని ప్రయత్నిస్తుండగా… మరోవైపు వర్మ సరికొత్తగా తనదైన స్టయిల్లో సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైకోర్ట్ నుంచి కూడా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి సినిమా విడుదల తరువాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయా సన్నివేశాలను తొలగించాలని ఆదేశిస్తామని ముందుగా చెప్పిన ఈసీ ఇప్పుడు ముందుగా తమకు సినిమా ప్రివ్యూను చూపించాలనడం గమనార్హం.

Related posts