రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు: ఈసీ

today is last day for voter application

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. అసెంబ్లీ రద్దు అనంతరం.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు.  హైదరాబాద్‌లో రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు.

కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఓటరు నమోదుకు సమయం సరిపోదని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయని, అయితే గత అనుభవాల దృష్ట్యా సమయం సరిపోతుందని సీఈసీ పేర్కొందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్నామన్నారు. ఈవీఎంలలో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నాయని, ఏ ఈవీఎం ఎక్కడకు వెళ్లేది చివరి నిమిషం వరకూ తెలీదని చెప్పారు.

మన దేశంలో ఈవీఎంల పనితీరు చాలా పక్కాగా ఉందని.. న్యాయస్థానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి వస్తారన్నారు. వివిప్యాట్‌ మిషన్లను కొత్తగా ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18లోగా ఈవీఎంలు, వివిప్యాట్‌లు జిల్లాలకు చేరాల్సి ఉందన్నారు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఎన్నికల ఏర్పాట్లను సీఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రజత్‌కుమార్‌ చెప్పారు.

Related posts

ఆంధ్రాలో అజ్ఞాతవాసికి 'బాబో'య్ ..!

admin

రాజ్యసభకు సంతోష్

admin

రాజకీయాల రంగూ రుచీ మార్చిన ఎన్టీఆర్

admin

Leave a Comment