telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

గంభీర్ పై .. ఎఫ్ఐఆర్ ..

gambhir aslo facing locality issue

ఎన్నికల సంఘం, టీమిండియా మాజీ క్రికెటర్‌, భాజపా నేత గౌతమ్‌ గంభీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ..దిల్లీ పోలీసులను ఆదేశించింది. అనుమతి లేకుండా ఆయన బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గంభీర్ భాజపా తరఫున తూర్పు దిల్లీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆప్‌ అభ్యర్థిని అతిషి, గంభీర్‌కు రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయంటూ ఫిర్యాదు చేశారు. కరోల్‌బాగ్‌, రాజీందర్‌నగర్‌ రెండు నియోజకవర్గాల్లో ఆయనకు ఓటరు కార్డులున్నాయని విలేకరుల సమావేశంలో అతిషి చెప్పారు. కరోల్‌బాగ్‌లో కూడా తనకు ఓటుహక్కు ఉందన్న విషయాన్ని ఆయన తన నామినేషన్‌ దాఖలు చేసేటపుడు అఫిడవిట్‌లో దాచిపెట్టారని, అందుకుగాను ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 6 నెలల జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉందని అన్నారు. రెండు ఓటరు చీటీల ఫొటోలను ఆమె ట్వీట్‌ చేశారు.

Related posts