telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

‘మోదీ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌ ’ప్రసారాన్ని నిలిపివేయండి: ఈసీ

pm modi fire pulvama terror attacks

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘మోదీ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ ప్రసారాన్ని నిలిపివేయాలని ‘ఎరోస్‌ నౌ’ సంస్థను ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. దేశంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో మోదీ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న 5 ఎపిసోడ్‌లను నిలిపివేయాలని సూచింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఆపేయాలని ఆదేశిస్తూ శనివారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకులకు సంబంధించిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయకూడదని ఈ నెల 10న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

Related posts