telugu navyamedia
రాజకీయ

సైబర్ నిపుణుడు షుజాపై ఈసీ ఫిర్యాదు

Smart Prepaid Electricity meters from April
2014 లోక్‌సభ ఎన్నికల్లో  ఈవీఎంలను  రిగ్గింగ్ చేశారని సయ్యద్ సుజా అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. సైబర్‌నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ సుజాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఒక లేఖలో కోరింది. ఈ ఆరోపణలపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని ఢిల్లీ పోలీసులను ఈసీ కోరింది.ఎన్నికల సంఘం వాడుతున్న ఈవీఎంలను ట్యాంపరింగ్ సులువుగా చేయవచ్చని షుజా బట్ట బయలు చేశాడు.
అమెరికాలో రాజకీయ శరణార్థిగా ఉన్నానన్న సయ్యద్ సుజా ప్రజల్లో భయాందోళనలు కలుగజేసే ప్రకటనల ద్వారా  ఐపీసీ సెక్షన్ 505(1)ని ఉల్లంఘించాడని ఈసీ  తెలిపింది. లండన్‌లో సోమవారం జరిగిన ఒక మీడియా సమావేశంలో అమెరికా నుంచి స్కైప్ ద్వారా మాట్లాడిన సయ్యద్ సుజా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపాలని ఈసీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని మరోసారి ఈసీ స్పష్టం చేసింది.

Related posts