telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల సందర్భంగా.. ఈసీ పట్టుకున్నది .. 2,626 కోట్లట .. !

huge money caught by police in ap

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో 18 రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 నియోజకవర్గాలో పోలింగ్ జరిగింది. మొత్తం 1,279 మంది అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు జరిగాయని ఎన్నికల సంఘం తెలిపింది. సగటు పోలింగ్ శాతం వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ మొత్తం 14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు తొమ్మిది కోట్ల వరకు ఓటేసినట్టు అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి సగటున 64.3శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు భావిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదుకాగా.. బీహార్ 50 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. అనేకచోట్ల ఈవీఎంలు మొరాయించగా, చాలాచోట్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ ఎన్నికల ప్రక్రియ గురించి ఎన్నికల సంఘం ఆసక్తికర వివరాలు వెల్లడించింది. పోలింగ్ ముగిసే దాకా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించామన్న ఈసీ అధికారులు, ప్రక్రియ మొదలైన నాటి నుంచి గురువారం సాయంత్రం 6గంటల దాకా దేశవ్యాప్తంగా రూ.2,626 కోట్ల మొత్తాన్ని స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. అందులో నగదు 607 కోట్లు కాగా, మిగతాది లిక్కర్, డ్రగ్స్,ఇతర వస్తు రూపంలో దొరికిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హింసలో ఇద్దరు హత్యకు గురికాగా, యూపీ ఎన్నికల్లో ఓ కార్యకర్త గుండెపోటుతో చనిపోయాడని, వీటితో పాటు 25 చోట్ల హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు చెప్పారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు ఆంధ్రప్రదేశ్తోపాటు అరుణాచల్ ప్రదేశ్, బిమార్, మణిపూర్, వెస్ట్ బెంగాల్ లోనూ జరిగాయన్నారు.

Related posts