telugu navyamedia
రాజకీయ వార్తలు

రైతు రుణ‌మాఫీ పై ఈసీ క్లారిటీ!

election-commission

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సర్కార్ రైతు ఋణ మాఫీ ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతుల రుణాల‌ను ఎలా మాఫీ చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం రైతు రుణ మాఫీ పై క్లారీటీ ఇచ్చింది. పోలింగ్ ముగిసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చు అని ఇవాళ ఈసీ స్పష్టం చేసింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం క‌మ‌ల్‌నాథ్ రైతుల‌కు రుణ‌మాఫీ క‌ల్పించాల‌నుకున్నారు. అయితే ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వేళ మాఫీ ఎలా చేస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నించాయి. దీంతో ఈసీని ఆశ్ర‌యించారు. ఎన్నిక‌లు ముగిసిన నియోజ‌క‌వ‌ర్గాల్లోని రైతుల‌కు రుణ‌మాఫీ చేయ‌వ‌చ్చు అని ఈసీ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా సుమారు 4.5 ల‌క్ష‌ల రైతులు రుణ‌మాఫీ ద్వారా ల‌బ్ధి పొందనున్నారు.

Related posts