telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

అరటితో.. గుండెజబ్బులకు చెక్…

eating banana will evade heart diseases

అరటిపండు, ఇది దొరకని సీజన్ అంటూ ఏది ఉండదు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలలో లభించే ఏకైక పండు ఇదే. దీనిని దాదాపుగా అందరు ఇష్టపడతారు కూడా. యధావిధిగా తీసుకోవడానికి ఇష్టపడని వారు, ఆహారంలో కలిపి, లేదా జ్యూస్, లేదా, మిల్క్ షేక్ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. మొత్తానికి అందరూ తీసుకోదగినది, ఎందుకంటె, త్వరగా, సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలలోకెల్లా ప్రధానమైనది ఈ అరటిపండు. అయితే దీనిని రోజు 3 చొప్పున తీసుకుంటే, హృద్రోగాలు రావని, తాజాగా పరిశోధనలలో రుజువైనట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి అరటి పండును రోజుకు 3 చొప్పున తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. పరిశోధనలో నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారి ఆహారంతో పాటు 3 అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సంబంధిత సమస్యలు రావని వెల్లడించారు.

రోజూ మూడుపూటలా తీసుకునే ఆహారంలో ఇది కూడా చేర్చుకుంటే సరిపోతుంది అంటున్నారు పరిశోధకులు. అంటే, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన శరీరంలోని పొటాషియం శాతం తగ్గుముఖం పడుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.

స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని అధ్యాపకులు చెబుతున్నారు.

పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని పరిశోధనలో తేలింది.

Related posts