telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఫ్లడ్ లైట్ల వెలుగులో గాలింపు చర్యలు

tourisam boat

తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్ట్ బోటు మునిగిపోవడతో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ బోటులో ఉన్నారు. కాగా ప్రమాద బాధితుల్లో 36 మంది తెలంగాణ వాసులే ఉన్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందినవారు 22 మంది ఉండగా.. వరంగల్‌కు చెందిన వారు 14 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఐదుగురు వరంగల్‌ వాసులు మాత్రం ఒడ్డుకు చేరుకున్నారు. మరో 9 మంది గల్లంతయ్యారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొందరు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో సహాయ చర్యలు చేపడుతున్నారు.గాలింపు చర్యల్లో 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, నేవీ గజ ఈతగాళ్లు కూడా కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే 2 హెలికాప్టర్లు, 8 బోట్లు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి.

Related posts