telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విధ్వంసం : టర్కీలో భారీ భూకంపం, సునామీ..

2020 సంవత్సరం అసలు ఎవరికీ అచ్చిరానట్టుంది. ఈ ఏడాది ప్రపంచ దేశాలకు నష్టమే మిగిల్చింది. ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా వైరస్ నించి తేరుకోక ముందే టర్కీ కి మరో ప్రమాదం ఎదురైంది. టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7 గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి తీవ్ర ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లింది. ఈ భారీ భూకంపం కారణంగా అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భూకంపం ధాటికి సముద్రంలో చిన్నపాటి సునామి సంభవించింది. ఇజ్మీర్ తీరా ప్రాంతానికి సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది. కుప్పకూలిన శిథిలాల కింద వెలది మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నాయి.వెయ్యి మందికి పైగా గాయపడ్డారని, ఇప్పటివరకు 22 మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. టర్కీతో పాటుగా గ్రీస్ లో కూడా భూకంపం సంభవించింది.

Related posts