telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

అత్యాచారం చేసి పారిపోయిన ఎన్నారై… చివరకు ఇయర్‌ఫోన్స్‌ వల్ల దొరికిపోయాడు…

Earphones left behind in car lead to arrest of Indian who fled UK after raping woman

2017 డిసెంబరు 9న ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ ప్రాంతంలో చలిలో నిల్చున్న యువతికి అజయ్ రానా అనే 35 ఎల్లా యువకుడు తన కారులో లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కారులో నుంచి యువతి దిగి పారిపోగా.. అజయ్ ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకు తల్లికి ఆరోగ్యం బాలేదని చెప్పి ఇండియాకు వెళ్లిపోయాడు. తనకు జరిగిన అన్యాయంపై యువతి పోలీసులను ఆశ్రయించగా.. చాలా రోజుల పాటు పోలీసులు అజయ్ ఆచూకీ కోసం వెతికారు. చివరకు అతని కారును గుర్తించిన పోలీసులు కారు అతనికి చెందింది కాదని, అది వేరే వ్యక్తిదని గుర్తించారు. అయితే కారులో లభించిన ఇయర్‌ఫోన్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపగా.. బాధితురాలి ఒంటిపై దొరికిన డీఎన్‌ఏ, ఇయర్‌ఫోన్స్‌పై దొరికిన డీఎన్‌ఏ ఒకటేనని తెలియడంతో అజయ్‌పై అరెస్ట్ వారెంట్‌ను పెట్టారు. దీని వల్ల అజయ్ మరోమారు యూరప్ వస్తే దేశ బహిష్కరణ చేస్తారు. అయితే ఊహించని విధంగా గతేడాది నవంబరులో అజయ్‌ను స్పెయిన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అజయ్‌పై విచారణ జరుపగా.. చివరకు తాను నేరం చేసినట్టు కోర్టులో ఒప్పుకున్నాడు. కోర్టు అజయ్‌కు ఏడేళ్ల శిక్షను విధించింది. శిక్షానంతరం అక్కడి ప్రభుత్వం అజయ్‌ను తిరిగి భారత్‌కు పంపనుంది.

Related posts