telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అతి పిన్న వయసుకే అర్ధశతకం చేసిన .. సచిన్ రికార్డును తిరగరాసిన.. షఫాలీ వర్మ..

early half century record by shafali varma

సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డు లను సృష్టించాడు. ఆయన తర్వాత ఎంతో మంది ప్రముఖ క్రికెటర్స్ వచ్చినా అతను చేసిన కొన్ని రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. కానీ తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరున ఉన్న 30 ఏళ్ళ రికార్డు ని ఓ 15 ఏళ్ళ అమ్మాయి బ్రేక్ చేసింది. మహిళల క్రికెట్ భారత ఓపెనర్ అయినా షఫాలి వర్మ వెస్టిండీస్‌ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో 73 పరుగులను 49 బంతుల్లో(6 ఫోర్లు, 4 సిక్సర్లు) కొట్టింది. ఇప్పుడు హాఫ్ సెంచరీ చేసిన షఫాలీ వర్మ వయసు కేవలం 15 సంవత్సరాల 285 రోజులు.

1989లో పాకిస్తాన్‌తో ఆడిన తన ఫస్ట్ టెస్ట్‌లో సచిన్ అర్ధ శతకం చేసాడు. అప్పుడు సచిన్ వయసు 16 సంవత్సరాలు 214 రోజులు. దీంతో షఫాలీ వర్మ సచిన్ రికార్డు ని చెరిపేస్తూ అర్ధ శతకం చేసిన ‘అతిపిన్న వయస్కురాలిగా’ ఇండియన్ క్రికెట్ చరిత్ర రికార్డుల్లో ఎక్కింది. నిజానికి షఫాలీ వర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి కేవలం రెండు నెలలే అవుతుంది కానీ ఆమె 30 ఏళ్ళ క్రికెట్ లెజెండ్ రికార్డు ని బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. ఆమె ఆడిన మ్యాచ్ విషయానికి వస్తే… వెస్టిండీస్‌ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత మహిళలు తొలి బాటింగ్ చేసి 20 ఓవర్లు లో 185 పరుగులు చేసారు. ఓపెనర్లు అయినా షఫాలీ వర్మ స్మృతీ మంధాన కలిసి 143 పరుగులు స్కోర్ చేసారు. తర్వాత బాటింగ్ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది.

Related posts