telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీక్రెట్ గా రాక్ రెండవ పెళ్ళి… 47 ఏళ్ళ వయసులో…!

Rock

హాలివుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ ను అభిమానులు ముద్దుగా రాక్ అని పిలుచుకుంటారు. రెజ్లింగ్ పోటీల్లో స్టార్ గా పేరొందిన డ్వేన్ జాన్సన్ తరువాత హాలీవుడ్ సినిమాల్లో నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. స్కార్పియన్ కింగ్, ది మమ్మీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో డ్వేన్ జాన్సన్ తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. హాలివుడ్ బాహుబలిగా పేరొందిన డ్వేన్ జాన్సన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఇప్పుడు రాక్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ యంగ్ హీరో 47 ఏళ్ల వయస్సులో తన ప్రియురాలు లారెన్ హాషియాన్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆగస్టు 18న జాన్సన్ రహస్యంగా లారెన్ ను హవాయ్ దీవుల్లో పెళ్లి చేసుకున్నాడు. అంతకు మునుపు రాక్ మొదటి భార్య డానీ గార్సియా నుంచి 2007లో విడాకులు పొందారు. ఇదిలా ఉంటే నటుడు రాక్‌కు ఇప్పటికే 18 సంవత్సరాల కూతురు ఉంది. కాగా రాక్ ప్రస్తుతం ప్రియురాలు లారెన్ ను రెండో వివాహం చేసుకున్నాడు.

Related posts