telugu navyamedia
సినిమా వార్తలు

“వినయ విధేయ రామ” : నష్టపరిహారం చెల్లించిన నిర్మాత

Vinaya Vidheya Rama movie pre release event images
బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ” సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించినా… డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటివారం రూ.50.4 కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే పండగ సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో మొత్తానికి 60 కోట్ల షేర్ మార్కును అందుకోగలిగింది. అంచనాలను అందుకోలేకపోయి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు 60 కోట్ల షేర్ రావడం విశేషమే.
ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ భారీగా నష్టపోయాడట. ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాలని భావించిన నిర్మాత డీవీవీ దానయ్య అతనికి 50 లక్షల వరకూ వెనక్కి ఇచ్చేశాడని సమాచారం. మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో దానయ్య వారితో చర్చలు జరుపుతున్నట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఊరటనిస్తుందనే చెప్పాలి. 

Related posts