telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఫలితాల వెల్లడి .. కేంద్రం అనుమతితోనే.. : ద్వివేది

ap election officer altered

తుది ఫలితాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన తరువాత మాత్రమే ప్రకటిస్తామని, రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించేందుకు మాత్రం ఈసీ అనుమతి అవసరం లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. నేడు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని, ఏపీలోని 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాల్స్ లో 25 వేల మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారని ఆయన అన్నారు.

10 కంపెనీల పారా మిలిటరీ బలగాలను ఎన్నికల కౌంటింగ్ భద్రత కోసం రంగంలోకి దించామని, రాష్ట్రంలో ఇప్పటికే మకాంవేసిన 45 కంపెనీల బలగాలకు వీరు అదనమని అన్నారు. ఏ కౌంటింగ్ కేంద్రానికి కూడా 100 మీటర్ల దూరం వరకూ ఎటువంటి వాహనాలకూ అనుమతి లేదని తెలిపారు. మొత్తం 3. లక్షల పోస్టల్ బ్యాలెట్లను జారీ చేయగా, 2. లక్షల ఓట్లు రిటర్నింగ్ అధికారులకు అందాయని వెల్లడించిన ఆయన, 60,250 సర్వీస్ ఓట్లను జారీ చేయగా, అందులో 30,760 మాత్రమే అందాయని తెలిపారు. వీటి లెక్కింపు తరువాత ఈవీఎంలను తెరుస్తామని స్పష్టం చేశారు.

Related posts