telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ : … స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ .. సరికొత్త రికార్డు ..

dutee chand new record in national

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో భారత మహిళా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్‌ ఫైనల్‌ రేసును 11.25 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ రేసులో ద్యుతీ చంద్‌ 11.22 సెకన్లలో గమ్యానికి చేరింది. ఈ క్రమంలో 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.

Related posts