telugu navyamedia
crime news Telangana

హైదరాబాద్ లో నకిలీ పోలీస్‌ ఆఫీసర్‌ అరెస్టు

SIT Investigation YS viveka Murder

హైదరాబాద్ లో ఓ నకిలీ పోలీస్‌ ఆఫీసర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎన్ఐఏ అదనపు ఎస్పీనని చెప్పుకు తిరుగుతున్న నకిలీ పోలీసు గురువినోద్ కుమార్ రెడ్డి ని అరెస్టు చేసినట్లు సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మీ మేజర్ ఇంట్లో గురువినోద్ కొన్ని వస్తువులు దొంగలించడాని తెలిపారు.

ఆర్మీ, ఎన్‌ఐఏ, ఐపీఎస్‌ వేషాలతో సాధారణ ప్రజలను బురిడీ కొట్టిస్తూ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి తుపాకీ, ల్యాప్ టాప్, స్టాంపులు, సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గురువినోద్ ను ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసిగా గుర్తించినట్టు చెప్పారు. సివిల్‌ సర్వీసెస్‌ సాధించలేక నకిలీ ఐపీఎస్‌ అవతారం ఎత్తినట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడి మీద గతంలోనూ ఇలాంటి కేసులే నమోదైనట్లు గుర్తించారు.

Related posts

ఏపీలో తప్పయితే.. తెలంగాణలో ఒప్పవుతాయ!: జగన్‌కు విజయశాంతి సవాల్‌

vimala p

దసరాకు .. వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులు..

vimala p

ఆగ్రా పేరును ‘అగ్రవాన్’గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం?

vimala p