telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఊపందుకొన్న ప్రచారం!

bjp trs cocngress

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు అక్టోబరు 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అక్టోబరు 19 చివరి తేదీ.

ఈ ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ఖరారు చేసేందుకు ఆయా పార్టీల నేతలు సిద్దమయ్యారు. మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా నోటిఫికేషన్‌ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ రోజు నుంచి దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ అమలు కానుంది.

Related posts