telugu navyamedia
క్రైమ్ వార్తలు

సినిమా కధలు.. నిజజీవితంలో…’దృశ్యం’…

Two sons murder after father sucide

సినిమా ప్రభావం ఎంతగా ఉంటుందో.. ఒకపట్టణ చెప్పలేము, కొందరు వాటిని చూసి మంచి నేర్చుకుంటుంటే, చాలా మంది వాటిలోని నెగటివ్ ని వారికి అవసరమైనప్పుడు వాడేసుకుంటున్నారు. అదికారులు కూడా హత్యల వంటి నేరాలకు ఇటీవల సినిమా నేపద్యాలు ఉండటం చాలా గమనిస్తున్నాం అంటున్నారు. ఈ మధ్యనే ఒక కేసును ఛేదించిన పోలీసులకు ‘దృశ్యం’ అనే సినిమా కళ్ళముందే కనిపించింది. ఆ సినిమా చూసి, ఓ హత్యకు ప్లాన్ చేసిన తండ్రీ కొడుకులు, రెండేళ్ల పాటు నిజాన్ని దాచగలిగారు. చివరికి పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లో రెండేళ్ల క్రితం మాయమైన యువతి మిస్టరీ, నిన్న సాయంత్రం వీడింది.

వివరాలలోకి వెళితే, ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన ట్వింకిల్ దాగ్రే (22) అనే మహిళ మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. జగదీశ్ కు ముగ్గురు కుమారులు అజయ్, విజయ్, వినయ్ లకు ఈ విషయం తెలిసింది. తమ తండ్రితో విభేదించిన వీరు, ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ అంగీకరించి, ప్లాన్ చేశాడు. ఆపై ‘దృశ్యం’ సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. ట్వింకిల్ ను హత్య చేసి, తగులబెట్టారు. ఆపై ఓ కుక్కను చంపి పూడ్చి పెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి.

పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, వారిలో అనుమానాలు పెరిగాయి. జగదీశే హత్య చేసి ఉండవచ్చన్న వారి అనుమానం నిజమై మిస్టరీ వీడింది. ట్వింకిల్ బ్రేస్ లెట్, ఇతర ఆభరణాలను రికవరీ చేశామని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Related posts