telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : .. నూతన వాహన చట్టం వ్యతిరేకించడంతో… రెచ్చిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ …

drunk and drive results licence cancellation

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ)కు సంబంధించి 1761 చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయగా, 263 మందికి శిక్షలు, 43 మంది లైసెన్స్‌లు తాత్కాలికంగా, ఒక లైసెన్స్‌ను దీర్ఘకాలికంగా రద్దు చేస్తూ 3,4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు తీర్పు చెప్పాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు.

ఇందులో ఒకరికి 7 రోజులు, 14 మందికి 3, 92 మందికి 2, 20 మందికి ఒక రోజు చొప్పున జైలు శిక్షలు, 136 మందికి కోర్టు పనివేళలు ముగిసే వరకు నిలిచి ఉండాలని కోర్టులు తీర్పు వెల్లడించాయన్నారు.

Related posts