telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

భారీ రేటుకు.. డ్రగ్స్.. నూతన సంవత్సర వేడుకలలో.. యువతే లక్ష్యం.. తస్మాత్ జాగర్త!

drugs mafia in kalki bhagavan asram

డ్రగ్స్ మాఫియా పై న్యూయర్ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇంకా పలు పార్టీల్లో, ఈవెంట్స్‌లో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఈ డ్రగ్స్ దందా కీలకంగా నడుస్తోంది. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్‌ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్‌గా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుంది. సాధారణ రోజులు కంటే న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మరింతగా డ్రగ్స్ మాఫియా కన్ను విస్తరిస్తుంది. న్యూ ఇయర్ వచ్చిదంటే చాలు సాధారణ సయమంలో అమ్మే రేట్ల కంటే 10రెట్లు పెంచేస్తారు. గ్రాము కొకైన్ రూ. వెయ్యి ఉంటే న్యూ ఇయర్‌కు దాని రేటును పది వేలకు పెంచేస్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను టార్గెట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా మత్తుబాబుల చిట్టాను రెడీ చేసుకుంది. రెగ్యులర్ కస్టమర్లే కాకుండా కొత్తవారిని దీంట్లోకి లాగేందుకు ప్లాన్స్ వేసింది. కొకైన్‌, హెరాయిన్‌, బ్రౌన్‌ షుగర్‌ లాంటి నిషేధిత మత్తు పదార్థాలు తమ దగ్గర ఉన్నాయని ఇంటిమేషన్ ఇస్తున్నారు.

పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. వీటిని కల్తీ చేసి మరీ అమ్మేందుకు డ్రగ్ మాఫియా రెడీ అయిపోయింది. 150 గ్రాముల హెరాయిన్‌కు పలు రసాయనాలు కలిపి వాటిని విక్రయిస్తున్నారు. న్యూయర్ సంద్భంగా పోలీసులు యువతకి పలు ఆంక్షలు విధించారు. అలాగే పార్టీలు, ఈవెంట్స్ జరిగే ప్రదేశాలను ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈసారి జరిగే వేడుకల్లో మహిళల సింగిల్స్‌కి ఎంట్రీ లేదని చెప్పేశారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలని పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగే అన్ని ప్రదేశాల వివరాలు తమకు ఇవ్వాలని, సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని వారు పేర్కొన్నారు. డిసెంబర్ 31 అర్థరాత్రి 11 గంటల వరకే న్యూయర్ సెలబ్రేషన్స్‌కి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 11 గంటలు దాటితే.. పబ్‌లను సీజ్ చేస్తామని, నిర్వాహకులను, కస్టమర్లను అరెస్ట్ చేస్తామని, వారిని తప్పకుండా కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ హెచ్చరించారు.

Related posts