telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. గిరిజన యువకులకు … కార్ల పంపిణి..

driver cum owner cabs to tribal

గిరిజన బిడ్డల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నందుకు సిఎంగారికి కృతజ్ణతలు అని గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో జరిగిని డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 52 మంది డ్రైవర్లకు కార్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు…. ” నేను గిరిజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన బిడ్డల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఈరోజు జరగడం చాలా గొప్పగా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో, వారి సబ్సిడీతో, ఎస్బీఐ రుణంతో మీరు వాహనానికి ఓనర్ గా అయ్యే చక్కటి అవకాశం ద్వారా నేడు 52మంది మా గిరిజన బిడ్డలు ఓనర్లుగా మారుతున్నందుకు వారికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపుతున్నాను.

ముందుగా నాకు దైవ సమానులు అయిన కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ణతలు తెలుపుతున్నా. ఒక గిరిజన బిడ్డ అయిన నాకు, ఒకతండాలో పుట్టి పెరిగిన నాకు, గిరిజన సంక్షేమ శాఖకు మంత్రిగా ఇవ్వడం, గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారి ఆలోచన క్రమం, బహుశా ఈమె తండాలో ఉంటుంది, వారి కష్టసుఖాలు తెలిసిన మనిషి కాబట్టి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందనే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు, కావునా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన బిడ్డలు, తండాలో, మైదాన ప్రాంతంలో, ఆదివాసి, కోయగూడాల్లో నివసిస్తున్నచెంచు పెంటలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు, మా సోదరి, మా ఆడబిడ్డ మంత్రిగా ఉంది, మాకు కష్టం వస్తు చెప్పుకోవచ్చు అనే విధంగా వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొని, ఒక ఆడబిడ్డ ఉందనే భరోసా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాను.

Related posts