telugu navyamedia
health trending

ఎండాకాలం .. పానీయాలుగా ఇవే తీసుకోవాలి .. !

drinks to take in summer for healthy lifes

ఎండాకాలంలో వేడి పెరిగిపోతుంది. దీనితో వెంటవెంటనే గొంతు ఎండిపోతుంది. మాములు నీరు ఎన్ని తాగినా దాహం తీరదు. కారణం, ఎండకు శరీరంలో లవణాలు ఆవిరైపోవటంతో.. సాధారణ నీరు సహించదు. అయితే అసలు నీరు తాగవద్దని కాదు, కానీ ఈ సీజన్ లో దొరికే అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఇతర దాహార్తిని తీర్చే పదార్దాలు తీసుకుంటుండాలి. రోజు తగిన నీరు తీసుకుంటూనే, ఎండాకాలంలో దానికి అదనంగా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మ లేదా ఆరంజ్ జ్యూస్, మీకు అందుబాటులో ఉంటె బెర్రీ, కుకుంబర్ జ్యూస్ లాంటివి కూడా చేర్చుకోవచ్చు. ఇంకా పుదీనా, పుచ్చకాయ, క్యారెట్, జామ, టమాటా వంటి వాటి జ్యూస్ ను కూడా నీటికి బదులుగా తీసుకుంటుండొచ్చు.

టమోటో జ్యూస్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉన్నది . ఇది తక్షణం ఎనర్జీని అందిస్తుంది. స్కిన్ కాంప్లెక్స్ ను పెంచుతుంది. బాగా పండిన టమోటోలను జ్యూస్ గా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి, అందులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి తీసుకోవాలి.

వేసవికి మందు మంచినీళ్లే. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు, చర్మం లోని తేమను కాపాడుతుంది. కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది. బయటికివెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లుతీసుకెళ్లడం మంచిది. వేసవిలో దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరికి దొరికినప్పుడుల్లా గొంతు తడుపుకోవడమే మంచిది.

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందువల్ల దీన్ని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. తయారుచేసేప్పుడు అందులోని విత్తనాలన్నీ తొలగించాలి.

క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది . ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కు ఒక చెంచా పంచదార కూడా జోడించి తీసుకోవాలి . కొద్దిగా పుదీనా వేస్తే కూల్ టేస్ట్ ను అందిస్తుంది.

drinks to take in summer for healthy lifesఈ వాటర్ మెలోన్ జ్యూస్ ను వేసవిలో పిల్లలు మరియు పెద్దలతో పాటు అందరూ తీసుకోవచ్చు. నాలుగు పీసుల వాటర్ మెలోన్ ముక్కలుగా చేసి జ్యూస్ చేసి విత్తనాలు తొలగించి తీసుకోవాలి.

పుదీనా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి, వేసవికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. రెండు చెంచాల నిమ్మరసంలో గుప్పెడు పుదీనా ఆకులు ఒక చెంచా తేనె మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ చేసి కూల్ స్మూతీలా అందివ్వాలి.

మీకు నచ్చిన వారికోసం ఆరోగ్యకరమైన డ్రింక్ ను అందివ్వడంలో ఇది ఒక హెల్తీ డ్రింక్. దీనికి కొద్దిగా ఒక చెంచా తేనె మిక్స్ చేసి, అలాగే చిటికెడు ఉప్పు మిక్స్ చేసి అందివ్వాలి.

గుప్పెడు బెర్రీలను జ్యూసర్ లో వేసి జ్యూస్ చేసి, అందులో కొద్దిగా పాలు మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. తొక్కను తీసి జ్యూసర్ లో వేసి జ్యూస్ తీసి అందులో కొద్దిగా పంచదార మరియు తేనె మిక్స్ చేసి తీసుకుంటే ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది మరియు వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.

హాట్ సమ్మర్ లో కూల్ గా లెమన్ జ్యూస్ త్రాగడం మంచిది . ఒక గ్లాసు వాటర్ లో నిమ్మరసాన్ని పిండి అందులో తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. వేసవిలో బాడీ హీట్ ను తగ్గించడానికి లెమన్ జ్యూస్ చాలా ఉత్తమం.

ప్రకృతి ప్రసాధించిన శీతల పానీయం. ఎండ వల్ల నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దప్పిక తీరిపోతుంది. అలసట గాలికెగిరిపోతుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రం చేయడం దాకా..బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. బయటినుంచి వచ్చాక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరినీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరి నీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది.

drinks to take in summer for healthy lifesఇందులో ఆరోగ్యకరమైన బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పోషక విలువలు, విటమిన్ల తయారీలో ఇది ఉపయోగపడుతుంది. మజ్జిగ జీర్ణశక్తిని ఇస్తుంది. జావ, కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, జీలకర్ర నీళ్ళు వంటివి కూడా శరీరంలోని వేడిని తగ్గించే దివ్వమైనటువంటి పానియం

పానీయాలు తీసుకుంటూ ఈ వేసవిని గడిపేయకూడదు, నీటి అవసరాలను శరీరానికి అందిస్తూనే, తగిన ఘన పదార్దాలను కూడా అందించాలి. లేదంటే త్వరగా నీరసించిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ఈ సీజన్ లో ఆహారపు అలవాట్లు చాలా జాగర్తగా పాటించాలి, లేదంటే సులభంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. తస్మాత్ జాగర్త!! ఆరోగ్యమే మహాభాగ్యం !!

Related posts

మాంసాహారం రోజూ తింటే ?

vimala p

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

బంగాళాదుంప పై పేటెంట్ రచ్చ : లేస్ చిప్స్ .. స్వచ్చందంగా బహిష్కరించాలి .. రైతులు

vimala p