telugu navyamedia
telugu cinema news trending

యువతితో స్టార్ హీరో రొమాంటిక్ ఫోన్ సంభాషణ… కెమెరాను చూడగానే ఆగ్రహంతో…!?

Sanjay-Dutt

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌దత్‌ ‘పూజ’ అనే యువతితో ఫోనులో రోమాంటిక్‌గా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 13వ తేదీన కలుద్దామని ఆమెకు చెప్పారు. ఈ వీడియోను టీవీ క్వీన్ ఏక్తా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఉన్నదాని ప్రకారం… ఫోనులో మాట్లాడుతున్న సంజయ్‌దత్ కెమెరాను చూడగనే ఆగ్రహంతో వెంటనే దానిని ఆపివేయాలని చెప్పడం కనిపిస్తుంది. సంజయ్‌దత్‌కు చెందిన ఈ వీడియోను షేర్ చేసిన ఏక్తా కపూర్ “మున్నాభాయ్ కూడా తన “డ్రీమ్‌గర్ల్‌”ను కలుసుకునేందుకు తపించిపోతున్నారు” అని కామెంట్ చేయడంతో పాటు “డ్రీమ్‌గర్ల్” అనే హ్యాష్ ట్యాగ్ తగిలించారు. కాగా సంజయ్‌దత్ కోరుకుంటున్న “డ్రీమ్‌గర్ల్” మరెవరో కాదు… ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న సినిమా పేరు. ఈ సినిమాలో ఆయుష్మాన్ “లోకేష్ బిష్ట్”, “పూజ” అనే రెండు క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఆయుష్మాన్ లేడీ గెటప్‌ను అతని అభిమానులు ఎంతగానే ఇష్టపడుతున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కాగా సంజయ్‌దత్ ‘పూజా’పై మనసు పారేసుకుని, ఆమెతో ఫోనులో మాట్లాడుతున్నారు. “డ్రీమ్ గర్ల్” సినిమా సెప్టెంబరు 13న విడుదల కానుంది. ఈ రొమాంటిక్, కామెడీ సినిమాకు ఏక్తాకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related posts

ప్రభుత్వం పై పోరాటానికి సిద్దమైన బాలుడు .. రెండో యూనిఫామ్ ఇవ్వలేదని రిట్ దాఖలు..

vimala p

దొరసాని : కప్పతల్లి కప్పతల్లి లిరికల్ వీడియో

vimala p

దొరసానిపై .. శ్రీరెడ్డి కౌంటర్…

vimala p