telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

“ఆధునిక విద్యారంగ చరిత్రే చుక్క రామయ్య జీవిత చరిత్ర”

chukka ramaiah

గురు పూర్ణిమను పురస్కరించుకొని డాక్టర్ చుక్క రామయ్య ఫౌండేషన్ వ్యాస పురస్కార ప్రధానోత్సవం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంగళరం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రంలో భాగంగా పాఠశాల విద్య పై అనేక పరిశోదనలు చేస్తూ అనేక పాఠ్య పుస్తకాలు, శిక్షణల్లో క్రియాశీలక భూమిక పోషించిన డాక్టర్ ఉపేందర్ రెడ్డిని చుక్క రామయ్య ఫౌండేషన్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్దన్ ఐ ఎ ఎస్ అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ విద్యారంగానికి చుక్కరామయ్య చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ లోని ఒక మారుమూల గ్రామలో జన్మించిన రామయ్య గారి జీవితమంతా ఉద్యమాలతో , విద్యారంగంతోనే అల్లుక పోయిందన్నారు. ఆధునిక విద్యారంగ చరిత్రే చుక్క రామయ్య జీవిత చరిత్ర అని అన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ్ పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించిన దేశభక్తుడు రామయ్య అని కొనియాడారు. స్కూల్ లో అక్షరాలు దిద్దుకుంటే జైలు లో జీవితాన్ని దిద్దుకున్నారని చెప్పారు. త్యాగధనుల స్పూర్తి తో, సూచనలతో జాతి నిర్మాణంలో తనవంతు బాధ్యతను నిర్వహించాలని1950 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులను బాధ్యత గల్గిన భావిపౌరులుగా తీర్చిర్చిదిద్దారని గుర్తు చేశారు.

DR Chukkaramaiah foundation programmeఉపాధ్యాయ సంఘాలలో కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ వృత్తి ధర్మాన్ని వీడలేదని తెలిపారు. సాంకేతిక విద్యే సామాజిక అసమానతలను తొలగించి సమాజాన్ని సమతుల్యం చేస్తుందని ధృడమైన దీక్షతో ఐ‌ఐ‌టి శిక్షణకు పూనుకొని సంపన్నుల పిల్లలకే కాదు సామాన్యుల పిల్లకు అందులో ప్రవేశం సాధ్యమని నిరూపించారు. విద్యార్థుల ప్రతిభాపాటవాళ్ళు దేశ సంపదగా మార్చాలంటే ఇక్కడి వనరులను వెలికి తీయాల్సి ఉంది. అపారమైన అటవీ సంపాద, జ్ఞాన సంపద కలిగిన ఆదిలాబాద్ జిల్లా బాసర క్షేత్రంలో ఐ‌ఐ‌టి స్థాపనకై అవిశ్రాంతగా ఆయన కృషి చేశారు.

విద్యారంగంలో తేవాల్సిన మౌలిక సంస్కరణలను సూచిస్తూ 60కి పైగా పుస్తకాలు రాశారు. కే‌జి నుంచి పి‌జి వరకు ఆయన సూచించిన అంశాలు తో కూడిన విలువైన పాఠాలు, సలహాలు విద్యారంగాన్ని మరింత తేజోవంతం చేయనున్నాయి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో రాజకీయాలు చోటు చేసుకున్నా బాసరలో కాకుండా హైదరాబాద్ పరిసరాల్లో ఐ‌ఐ‌టి ఏర్పాటు చేశారు. స్థల మార్పిడి కావచ్చు కానీ రాష్ట్రానికి ఐ‌ఐ‌టి సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పలువురు ప్రశంసిచారు. విద్యతోనే సమసమాజ స్థాపన సాధ్యం అని రామయ్య గట్టిగ నమ్ముతారు. ప్రభుత్వం కూడా ఎప్పుడు కార్పొరేట్ వైపు విమర్శలు మానుకొని, ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలనీ ఆయన స్పష్టంగా చెప్పారు. 

Related posts