telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు..

students

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్‌’ గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. భారీ వర్షాలు, వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక విడత రిజిస్ర్టేషన్‌, ఆప్షన్ల ఎంపిక గడువును కూడా ఈనెల 28 వరకు పొడిగించామన్నారు. ప్రత్యేక విడత  జాబితాను ఈనెల 31న విడుదల చేస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 31 నుంచి నవంబరు-5లోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ వల్ల అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు కాకుండా పరీక్షలు కూడా రద్దయ్యాయి. దీంతో విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారిపోయింది. అటు చాల రాష్ట్రాలు పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేసాయి. ఇక ఇపుడు కరోనా తీవ్ర కాస్త తగ్గింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నియమాలు పాటిస్తూ విద్యాసంస్థలను నడపాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

Related posts