telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “దొరసాని” ట్రైలర్

Dorasani

కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా “దొరసాని” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. అప్పటి దొరల కాలంనాటి తెలంగాణ పరిస్థితులతో ట్రైలర్ ని కట్ చేశారు. దొరల కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తక్కువ జాతిలో పుట్టిన ఓ కుర్రాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. ట్రైలర్ లో “నా ప్రేమ కూడా ఉద్యమమే” అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ బాగుంది. జూలై 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts