telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆటను పాడుతుంటే.. గొంతు కలిపిన గాడిద.. తిట్టిందా.. మెచ్చుకుందా.. !

donkey supports while his owner singing

సాధారణంగా పాటలు వింటూ సంతోషపడేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే పాడే భాగ్యవంతులు కొందరే ఉంటారు. మిగిలిన వారుకూడా పడేందుకు బాత్రూం లో ప్రయత్నిస్తుంటారు.. అనేది కూడా అంతే నిజం. మరి అది బాత్రూం దాటి బయటకు వస్తేనే కష్టం. మాములుగా హాస్యానికైనా, గొంతు బాగాలేని వారు పాడితే.. అచ్చం గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉంది!.. అంటుంటాం. ఓ వ్యక్తి పాట పాడుతుంటే దూరంగా గాడిద అరుపులు వినిపించే కామెడీ సీన్లు చాలా సినిమాల్లో మనం చూసుంటాం.

అచ్చం అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యాజమాని పాడిన పాటకు గాడిద గొంతు కలిపింది. లయన్‌ కింగ్‌ సినిమా ఓపెనింగ్‌ సాంగ్‌ ”అకూన మటాట”కు గాడిద తన గొంతు సవరించింది. కిన్లే అనే వ్యక్తి తన పెంపుడు జంతువులు గాడిద, గుర్రం దగ్గర ఈ పాటను పాడాడు. ఆ పాటకు గుర్రం స్పందించలేదు కానీ, గాడిద మాత్రం యాజమానితో గొంతు కలిపి ఓ రెండు లైన్లు పాడింది. మరి పాట పాడిందో.. యాజమాని గొంతు వినలేక ఆపమని ఏడ్చిందో.. అది గాడిదకే తెలియాలి. కిన్లే ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌లో ఖాతాలో పోస్ట్‌ చేయగా 2.7మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయంటే .. ఎంత మంది ఆ గాడితను పాపులర్ చేశారో కదా.. అదీ తమవిలువైన సమయాన్ని వృధా చేస్తూ మరి.. ఎంత జంతు ప్రేమో!!

Related posts