telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాడిద పాడడం ఎక్కడైనా చూశారా ?

Donkey

అమెరికాలో ఓ గాడిద మనిషితో కలిసి పాట పాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ గాడిద సంగీతానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. సౌత్ కెరోలినాలోని ట్రావిస్ కిన్లే అనే ఓ వ్యక్తి లయన్ కింగ్ చిత్రంలోని సర్కిల్ ఆఫ్ లైఫ్ అనే పాటను పాడుతుండగా… వెనుక ఉన్న గాడిద కూడా ఆ వ్యక్తితో పాటు పాటను పాడడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియో రికార్డింగ్ చేసి తరువాత దాన్ని చూసేంతవరకు తాను కూడా నమ్మలేకపోయానని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయగా.. దాదాపు 50 లక్షల మంది దీన్ని వీక్షించారు. ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకర్షిస్తోంది.

Related posts