telugu navyamedia
రాజకీయ వార్తలు

అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

trump usa

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 3 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలు నవంబర్‌ లో నిర్వహించకుండా కొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పారు. అమెరికాలో కరోనా విజృంభణ విపరీతంగా ఉండడంతో ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని తెలిపారు.

అమెరికాలో ఈ విషయాలేవీ పట్టించుకోకుండా మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ చేపడితే ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి కోలుకుని ప్రజలు సరిగ్గా తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పారు. అమెరికాకు స్వాతంత్రం వచ్చినప్పటికీ నుంచి ఇంతవరకు ఎప్పుడూ అధ్యక్ష పదవికి ఎన్నికలు వాయిదా పడలేదు. అమెరికా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని యుద్దాలు చేసినా ఎన్నికలు మాత్రం వాయిదా వేయలేదు.

Related posts