telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్న ట్రంప్…

Trump Usa

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్ ఒదిన విషయం తెలిసిందే. అయితే ఒదిన తర్వాత కూడా చాలా రచ్చ చేసి వెళ్లిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కొత్త పార్టీ పెడతారనే వార్తలపై ఆయన ప్రచార సలహాదారు మిల్లర్ స్పందించారు. పార్టీ పెట్డడంపై ట్రంప్ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పారు. 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో హౌజ్, సెనేట్‌లో మళ్లీ రిపబ్లికన్లను గెలిపించడంపై ట్రంప్ ప్రస్తుతం దృష్టి పెట్టారన్నారు. ఇక, వైట్‌హౌస్‌ను వీడే ముందు రోజు ట్రంప్ ఓ వీడియో పోస్టు చేసిన ట్రంప్.. 2024 అధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీంతో, ట్రంప్ మూడో పార్టీ స్థాపించే అవ‌కాశాలు ఉన్నట్లు వ‌దంత‌లు వ్యాపించాయి. కానీ ,ఆ వార్తల‌ను కొట్టిపారేశారు మిల్లర్. కాగా, అమెరికా అధ్యక్షుడిగా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్‌.. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.. ఇక, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్.. ఈ నెల 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు కూడా చేపట్టారు. చూడాలి మరి ఈయన పాలనా ఎలా ఉంటుంది అనేది.

Related posts