telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

టిక్‌టాక్‌కు ట్రంప్ డెడ్‌లైన్‌..ఆరు వారాల గడువు!

trump usa

చైనా యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు చేశారు.తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తామని చెప్పారు.

టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను తమ దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి 6 వారాల గడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగియాలని చెప్పారు. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్ద సంస్థకు విక్రయించాలని ఆయన చెప్పారు. భద్రత విషయంలో తమకు ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని తెలిపారు.

Related posts