telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే సత్తా అమెరికాకు ఉంది: ట్రంప్

trump usa

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. త్వరలోనే ప్రపంచం శుభవార్తను వింటుందని ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్ పై అమెరికా విజయం సాధించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

ఇటీవల నార్త్ కరోలినాలో పర్యటించిన ఆయన కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలపై ప్రశంసలు కురిపించారు.అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు కరోనాపై విజయం సాధించే దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో ముందున్న మొడెర్నా, ఇప్పటికే మూడో దశ ట్రయల్స్ ను ప్రారంభించిందని చెప్పారు. ఒకసారి దీనికి అనుమతి లభించగానే అమెరికన్లందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రపంచానికి కూడా ఈ వ్యాక్సిన్ ను అందించే సత్తా అమెరికాకు ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related posts