telugu navyamedia
రాజకీయ వార్తలు

నవంబరు కంటే ముందే కరోనా వ్యాక్సిన్: ట్రంప్

Trump Usa

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు రష్యా, చైనా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాక్సిన్ పై ప్రకటనలు చేస్తున్నారు.

పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడుతూ నవంబరు కంటే ముందే వ్యాక్సిన్ రాబోతోందని ఈ సందర్భంగా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ లభ్యతకు చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు. అది కేవలం కొన్నివారాల దూరంలోనే ఉందని వివరించారు.

కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడానికి కారణం తానేనంటూ పరోక్షంగా కితాబిచ్చుకున్నారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా దానంతట అదే మాయమైపోతుందని పేర్కొన్నారు.

Related posts