telugu navyamedia
రాజకీయ వార్తలు

నియంత్రించే వీలున్నా అలా జరగలేదు: చైనాపై ట్రంప్ విమర్శలు

trump usa

ప్రపంచదేశాలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచదేశాలకు కరోనా విషయంలో చైనాలో ఏదో ఘోరమైన పొరపాటు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

చైనా తప్పిదమో, లేక చేతకానితనం వల్లనో ఇప్పుడు యావత్ ప్రపంచం బాధపడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను చైనా ఏదో ఒక దశలో నియంత్రించే వీలున్నా అలా జరగలేదని అన్నారు. అసలు, కరోనాను దాని మూలం వద్దే నిలిపివేసే అవకాశం ఉందన్నారు. కానీఅక్కడ ఏదో జరిగిందని ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు.

Related posts