telugu navyamedia
Uncategorized

చైనాతో సంబంధాలను పూర్తిగా వదులుకుంటాం: డొనాల్డ్‌ ట్రంప్

కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా మండిపడుతున్న విషయం తెలిసిందే.ఆ వైరస్ వ్యాప్తి గురించి చైనా ముందుగా ప్రకటన చేయనందుకే తమ దేశంలో ఇంతగా వైరస్ విజృంభించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ మహమ్మారి విషయంలో చైనా వ్యవహార శైలితో తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా వదులుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు తాము ఏ మాత్రం వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. దీనివల్ల అమెరికాకు 500 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం విషయంలో మళ్లీ చర్చలు జరిపే అవకాశం లేదని ట్రంప్ చెప్పారు. 

Related posts