telugu navyamedia
రాజకీయ వార్తలు

బంకర్ ను పరిశీలించడానికి వెళ్లాను: ట్రంప్

trump usa

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట కూడా నిరసన జ్వాలలు మిన్నంటడంతో భద్రత కారణాల రీత్యా ట్రంప్ ను అధికారులు వైట్ హౌస్ లో ఉన్న హైసెక్యూరిటీ బంకర్ కు తరలించారు. దాంతో ట్రంప్ దాక్కున్నాడంటూ పలు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు.

తాను బంకర్ లో దాక్కున్నట్టు వచ్చిన వార్తలను చూశానని, వాస్తవానికి తాను బంకర్ ను పరిశీలించడానికి మాత్రమే వెళ్లానని తెలిపారు. గతంలోనే అనేక పర్యాయాలు బంకర్ లోకి వెళ్లానని, అదేమంత ముఖ్య విషయం కాదని, ఎవరైనా తన సమీపంలోకి వచ్చినా భయపడబోనని ధీమా వ్యక్తం చేశారు.

Related posts